YSRCP: వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింగి. అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మహమ్మద్ ఇక్బాల్ ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఫ్యాక్స్ , మెయిల్ ద్వారా లేఖను ఇక్భాల్ పంపారు.
Read Also: Posani Krishna Murali: వాలంటీర్ల అంశంపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు
మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంచార్జ్‌గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇంచార్జ్‌గా నియమంచారు. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.