Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం గుండుపల్లి పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘పల్లె పల్లెకు కాకర్ల’ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కాకర్ల సురేష్ వెంట నడుస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కాకర్ల సురేష్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. మార్పు కావాలంటే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థినైన తనను, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కాకర్ల సురేష్ అభ్యర్థించారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే లభిస్తాయని ఆయన అన్నారు.. ఈ ప్రచారంలో టీడీపీ మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, చింతల శ్రీను, సర్పంచ్ కే భాగ్యమ్మ, కే జ్యోతి, జనార్దన్ రెడ్డి, సర్పంచ్ వెంకటరెడ్డి, సర్పంచ్ పుత్తూరు వెంకటసుబ్బయ్య, చంద్ర రెడ్డి, దేవా, ప్రసన్న, అబ్రహం, జాషువా పాల్గొన్నారు.