రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన తర్వాత సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.
బండి సంజయ్ సమక్షంలో హుస్నాబాద్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచులు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ప్రసంగించారు. ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదని.. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్‌పై చర్చ జరిగిందన్నారు.
మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో నెంబర్‌వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
గరుడ ప్రసాదం పంపిణీపై స్పందించారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. చిలుకూరు దేవస్థానంలో పంపిణీ చేయాల్సిన గరుడ ప్రసాదం పంపిణీని నిలిపిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారీగా భక్తులు వస్తుండటంతో ఇవాళ్టితో ప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది.
చేవెళ్ళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి జోరు పెంచారు. టికెట్ ప్రకటించిందే ఆలస్యంగా పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఊరు, వాడ తిరుగుతున్నారు. ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టేయగా.. దాదాపు ప్రతి నియోజకవర్గంలో బూతు కమిటీల మీటింగ్.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు.