Prabhas : షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.. ‘ఫౌజీ’ సెట్స్‌లో ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా సమయంలో సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ అలాగే బాడీ లాంగ్వేజ్‌పై కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఫేస్-స్వాప్ (Face-swap) టెక్నాలజీ వాడారని, ప్రభాస్ కష్టపడటం లేదని ట్రోల్ చేశారు. కానీ, తాజాగా జరిగిన ఒక సంఘటనతో ఈ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టిగా సమాధానం ఇస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fauzi) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలోని ఒక కీలకమైన హార్స్ రైడింగ్ (గుర్రపు స్వారీ) సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రభాస్‌కు చిన్నపాటి గాయమైంది. గుర్రంపై నుంచి అదుపు తప్పి కింద పడటంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియగానే అభిమానులు ఆందోళన చెందారు, కానీ ఇది చిన్న గాయం మాత్రమేనని, ప్రభాస్ కోలుకున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ గాయం వార్తను చూపిస్తూ ఫ్యాన్స్ ట్రోలర్స్ పై విరుచుకుపడ్డారు.. ‘ప్రభాస్ ఎంత డెడికేషన్ తో పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. డూప్స్ వాడకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ తన ఆరోగ్యం గురించి కూడా పటించుకోకుండా, సినిమాల కోసం ఎంత కష్టపడుతున్నారో ఈ సంఘటన ద్యారా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మరికొంత కాలం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని డార్లింగ్ భావిస్తున్నారు.
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
తాజావార్తలు
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!