ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వై నాట్ 175 టార్గెట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత రైఫిల్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం.
హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయడం పట్ల నెటిజన్లు, హిందుత్వ వాదులు ఫైర్ అవుతున్నారు.
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏండ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.