*నేటితో ముగియనున్న మేమంతా సిద్ధం వైసీపీ బస్సు యాత్ర.. ఉదయం 9 గంటలకు అక్కివలస రాత్రి బస నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఎచ్చెర్ల బైపాస్,శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్ , కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వరకు జగన్ బస్సుయాత్ర.. భోజన విరామం అనంతరం కె. కొత్తూరు మీదుగా సాయంత్రం 3:00 గంటలకు టెక్కలి వద్ద బహిరంగ సభలో సీఎం ప్రసంగం.
*నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ సెక్రటరీ.
*నేడు సికింద్రాబాద్, వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్.. దానం నాగేందర్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. సాయంత్రం వరంగల్‌లో బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి.
*తెలంగాణలో కేసీఆర్ బస్సుయాత్ర.. నేటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర.. మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు కేసీఆర్ బస్సుయాత్ర.
*ఈడీ కేసులో కవిత బెయిల్‌పై నేడు మరోసారి విచారణ.. మధ్యాహ్నం 2 గంటలకు విచారించనున్న కోర్టు..
*తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలకు వేసవి సెలవులు.. జూన్ 11 వరకు కొనసాగనున్న వేసవి సెలవులు.. జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం
*విశాఖ: నేడు అనకాపల్లి రానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. సుంకరమెట్ట మీదుగా 4రోడ్ల జంక్షన్ వరకు బీజేపీ విజయీభవ ర్యాలీ.. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి.
*అమరావతి: సీఎం జగన్‌పై దాడి కేసు.. సతీష్‌ను ఏడు రోజుల కస్టడీకి కోరిన పోలీసులు.. కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న కోర్టు.
*అమరావతి: వాలంటీర్ల రాజీనామాలపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. ఏపీ వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.
*తిరుమల: ఇవాళ జులై నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు రోజుకు 18 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్న టీటీడీ.
*శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 13వ ఆరాధన ఉత్సవాలు.. ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక అలంకరణలో ముస్తాబైన ప్రశాంతి నిలయం.. సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా నారాయణ సేవలో పాల్గొని నిరుపేదలకు అన్న వస్త్రాలను పంపిణీ చేయనున్న కేరళ గవర్నర్.
*ప్రకాశం : ఒంగోలులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. దొనకొండలో వైసీపీ అభ్యర్ధి బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. చీమకుర్తిలో సంతనూతలపాడు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రి మేరుగ నాగార్జున.. యర్రగొండపాలెంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న తాటిపర్తి చంద్రశేఖర్.. కనిగిరి అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్న దద్దాల నారాయణ యాదవ్.. కనిగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి.. గిద్దలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న ముత్తుముల అశోక్ రెడ్డి.. రాచర్ల మండలం జెల్లివారి పుల్లలచెరువు నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం..
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,150.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,140.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 86,400.
*ఐపీఎల్: నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా మ్యాచ్.