చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీలో సరీసృపాలు దాగి ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయి పెరిగి 320కి చేరుకోవడంతో సోమవారం రాత్రి తీహార్ జైలులో ఇన్సులిన్‌ను అందించారు.
ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా భారత్‌కు చెందిన గీతా సబర్వాల్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నియమించారు. సోమవారం తన పదవిని చేపట్టిన సభర్వాల్.. వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇచ్చే అభివృద్ధిలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.
కొత్తగా గడ్డం వచ్చిన యువకులు షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ ఏది మంచిది.. అంటూ తరచుగా గందరగోళానికి గురవుతారు. హెయిర్ స్టైలింగ్ అనేది పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు యుక్తవయసులో ఉండి, మొదటిసారిగా కొత్త గడ్డం తీయాలని కోరుకుంటే, షేవింగ్ చేయాలా లేదా కత్తిరించాలా అని అయోమయంలో ఉంటే అప్పుడు ఈ కథనం మీ కోసం మాత్రమే. ట్రిమ్ చేసేటప్పుడు లేదా షేవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
యూఏఈలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు సంబంధించిన కొన్ని ఫోటోలను నాసా విడుదల చేసింది. ఇందులో వర్షం కురిసే ముందు, తర్వాత ఆ ప్రాంతం చూపబడింది.
మాజీ ప్రధానులు కొత్త భారతదేశాన్ని రూపొందించడానికి పనిచేశారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇతరులను మాత్రమే విమర్శిస్తున్నారని, గత పదేళ్లలో తన ప్రభుత్వం ప్రజలకు చేసిన వాటి గురించి మాట్లాడలేదని ఎన్సీపీ(ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ సోమవారం అన్నారు.
గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీటెనర్ అధిక స్థాయిలో ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు.
రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ అరెస్టుపై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.