60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తు్ంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల అందాల భామ.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తోన్న కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు.
చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు.
జపాన్‌లోని బోనిన్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) శనివారం సమాచారం ఇచ్చింది. భూకంప కేంద్రం 503.2 కిమీ (312.7 మైళ్ళు) లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.
వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్ చెప్పారన్నారు.
వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. వైసీపీది రియాల్టీ మేనిఫెస్టో అని.. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాల నుంచి బయట పడవేసే మేనిపేస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.