రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
కంబోడియాలో పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 20 మంది సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని కంబోడియా ప్రధాని హున్ మానెట్ తెలిపారు. కంపాంగ్ స్పీ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరంలో జరిగిన పేలుడు గురించి తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మానెట్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
రోజువారీ రైల్వే ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే వందే మెట్రో రైలును నడపనుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెట్రో మార్గంలో నడిచే ఈ రైళ్లు మొదటి దశలో దేశంలోని 124 నగరాలను కలుపుతాయి. జూలై నుంచి తొలి వందే మెట్రో రైలు పట్టాలపై నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తాను డబ్బులు తీసుకొని ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. కావాలంటే నార్కో టెస్ట్ నిర్వహించండి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ అవ్వకముందు నుంచే ప్రెస్‌మీట్‌లు పెట్టానన్నారు. గత 15 ఏళ్లుగా ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నానన్నారు. పెయిడ్‌గా ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా వేరే దేశానికి వెళ్లిపోతానన్నారు.
భారత్‌కు చిన్న ఆయుధాలను విక్రయించడంపై ఉన్న నిషేధాన్ని జర్మనీ తాజాగా ఎత్తివేసింది. ఈ చర్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ మేరకు శుక్రవారం వర్గాలు వెల్లడించాయి. గతంలో, జర్మనీ నాటోయేతర దేశాలకు చిన్న ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది.