బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు
జగన్‌ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు.