కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదని.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారన్నారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. చెప్పింది చేస్తారన్న నమ్మకం ప్రజల్లో కుదరాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నందిగామ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు. ఇవాళ ఆయన నందిగామ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ, ప్రజలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరొకసారి తనను గెలిపించమని అభ్యర్థిస్తున్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
రేపటి(మే 1) నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8:30 గంటల నుంచీ 11 గంటలలోపు డీబీటీ ద్వారా అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు.
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత, మనమందరం ఆరోగ్యకరమైన, రిఫ్రెష్‌గా ఏదైనా తినాలని లేదా తాగాలని కోరుకుంటాము. అటువంటి పరిస్థితిలో మనలో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో రసం తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తారు.
మధ్యప్రదేశ్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంనివాస్ రావత్ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గతంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు.