తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది.
న్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉదయగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజలు ఆయనను పూల వర్షాలతో ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జలదంకి మండలం కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బోయలపాడు, వేములపాడు, కోదండరామపురం పంచాయతీలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీ ఎన్నికల్లో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటు హక్కు వివియోగించుకోనున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ఫైనల్ ఎస్ఎస్ఆర్ కంటే తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు భారీ నగదుతో వెళ్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. 4 కంటైనర్ల నిండా నగదు పట్టుబడింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోందని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. కోర్టు అనుమతి తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.