ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల కేసులో ఇద్దరు ఆయుధాల సరఫరాదారుల్లో ఒకరు ఈరోజు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టయిన అనూజ్ తపన్ (32) ఉదయం 11 గంటలకు పోలీసు లాకప్‌కు అనుబంధంగా ఉన్న టాయిలెట్‌కి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిసింది.
పేదలకు సాయం చేస్తుంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని.. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఏలూరులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మన రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు దారులు కోటీ 40 లక్షలు ఉన్నారని.. పేదలందరికీ పథకాలు అందాలా వద్దా అంటూ ముఖ్యమంత్రి అన్నారు.
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
లెమన్ టీ, గ్రీన్ టీ పేర్లను మీరు ఎక్కువగా వినే ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. అదేవిధంగా, చమోమిలే టీ ఉంది, ఇది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రతి ఒక్కరికీ కాల్ చేసి, మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.