GVL Narasimha Rao: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు.. ఎన్డీఏకు 400 స్థానాల్లో గెలుపు ఖాయమని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి జాతీయ మేనిఫెస్టో మాత్రమే ఉంటుందని.. బీజేపీ మేనిఫెస్టోకి ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇచ్చినట్లే ఏపీలో కూటమి మేనిఫెస్టోకు బీజేపీ సహకరిస్తుందన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయింపుపై జనసేన హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఏపీలో మోడీ ఫ్యాక్టర్‌ను కూటమి వినియోగించుకోవాలన్నారు. ప్రజలు మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కూటమి నేతలు ప్రచారంలో మోడీ గురించి ప్రస్తావిస్తే కూటమికి మంచి ఫలితాలు వస్తాయన్నారు.
Read Also: Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
తెలంగాణలో బీజేపీ 10కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. బీజేపీని విమర్శించే నైతికత కేసీఆర్ కోల్పోయారన్నారు. బీఆర్ఎస్ అవినీతి మయం అయ్యిందని.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు పర్చని కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.