పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు.
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్‌లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేక పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ మార్పు కోసం వచ్చాడని అందరం భావించాం.. కానీ ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి వచ్చాడని ఈ మధ్యే అర్థం అయిందని ఆయన చెప్పారు.
నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్‌కి వ్యతిరేకంగా ప్రధాని వ్యవహారం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విజయవాడలో మోడీ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది.