Acid Attack: హైదరాబాద్‌లోని ఇక్ఫాయి(ICFAI) యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. రంగు నీళ్లు అనుకుని తోటి విద్యార్థులే బకెట్‌లో ఉన్న యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినట్లు తెలుస్తోంది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Robinhood: ఏటీఎం కార్డుల మార్పిడితో ప్రజలను మోసం చేసిన ఆర్మీ జవాను.. చివరకు..