ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.
ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వెరీ క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఆరోపణలపై స్పందించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తనపై బ్రహ్మనంద రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మేము ఎటువంటి దాడులు చేయలేదని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.