మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది.
కట్టుకున్న భార్యపై అనుమానంతో కడతేర్చాలని ప్రయత్నించాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోని జగనన్న కాలనీలో చోటుచేసుకుంది. అనుమానం నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. తాజాగా మరోసారి ఆ విషయంపై వాగ్వాదం నెలకొనగా.. ఆగ్రహంతో భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు.
విశాఖ-హైదరాబాద్ జన్మభూమి రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జన్మభూమి రైలును విశాఖలో నిలిపివేశారు. ఉదయం 6.20 గంటలకు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగిపోగా.. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాణవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసరి ప్రాంతంలో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు తెలిపింది.
ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్లుగా బుధవారం నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు.
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలింగ్ కేంద్రం నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డయ్యారని తెలిపింది.