*నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.
*నేడు నెల్లూరు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్.
*అనంతపురం : నేడు తాడిపత్రికి మరోసారి సిట్ బృందం సభ్యులు.. ఘర్షణలకు సంబంధిన కేసులలో పురోగతి,జరుగుతున్న దర్యాప్తుప్తె ఆరా.. నమోద్తెన కేసులలో అజ్ఞాతంలో ఉన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు.
*తిరుమల: ఇవాళ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు.. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు.
*తిరుమల: ఇవాళ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ తిరుమల పర్యటన.. సాయంత్రం తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలలో అనుగ్రహభాషణ చెయ్యనున్న స్వరూపానంద స్వామిజీ.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న స్వరూపానంద స్వామిజీ
*తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో నృశింహ జయంతి వేడుకలు.. ఆలయంలోని యోగనరశింహ స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్న అర్చకులు
*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 35,726 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు
*తిరుపతి: నేటి నుండి మూడురోజుల పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు
*నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోరుతూ గ్రాడ్యుయేట్ సభకు హాజరు.. అనంతరం ములుగు జిల్లాలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్.
*నేడు ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్.. రాజస్థాన్-బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,500.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68,290.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ. 98,900.