ఫైర్ క్రాకర్స్ పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం విధించారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి సిఫారసు మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు టపాసుల తయారీ, కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కలెక్టర్ నిషేధం విధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది.
ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.
పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు.
మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.