బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. ఈ కేసులో నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మంత్రి వాహనంపై సీసీబీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేవ్ పార్టీ సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాన్ని ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎలక్షన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
కంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ కంబోడియా కొనసాగుతోంది. మొదటి రోజు 25 మందికి విశాఖ పోలీసులు విముక్తి కలిగించారు. కంబోడియాలో విశాఖకు చెందిన మొత్తం 58 మంది యువకులు చిక్కుకున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది
నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి. కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.