తెలుగు పాఠ్య పుస్తకం లో ముందుమాట మార్చకపోవడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌లు బస్ భవన్‌ను శుక్రవారం సందర్శించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమాలను వారికి వివరించారు.
కరీంనగర్ సీపీ, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమక్షంలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తిక్క సుష్మిత అలియాస్ చైతే ఏరియా కమిటీ మెంబర్‌గా, మడకం దూల ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు బాబాయ్ అనే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి.
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. జగిత్యాల పట్టణంలో 4వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ లైబ్రరీ డైరెక్టర్ సుధాకర్ ఇళ్లు కట్టుకుంటే జీవన్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం తగదన్నారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్‌లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్ చేశారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తోంది ఈ దొంగల ముఠా. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని అడిగారు ఆ దొంగలు.
తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తు లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది.
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు.