అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్‌లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.
వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.