Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు
- ఇబ్బంది పడుతున్న సామాన్యులు
- రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు బాబోయ్ అనే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: AP CM and Deputy CM: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
హైదరాబాద్ రైతు బజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30 నుంచి 50 శాతం వరకు ధరలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర రూ. 35 రైతు బజార్‌లో ఉంటే.. బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి 45 వరకు పలుకుతోంది. ఇక టమాటాను కొనేటట్టు లేదు. రెండు వారాల్లోనే టమాట రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర రూ. 40 నుంచి 50 మధ్య నడుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఇంకా ఎక్కువకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. పచ్చిమిర్చి రైతు బజార్‌లో రూ.65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర రూ. 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. చిక్కుడ ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 50 – 60 మధ్య ఉంది. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వానాకాలం సాగుకు సంబంధించి ఆగస్టు వరకు పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు మార్కెట్‌కు చేరితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!