గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపోయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఇకపై విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. గన్నవరం నుండి ముంబైకి విమాన సర్వీసును ఎంపీలు బాలశౌరి, ఎంపీలు కేశినేని చిన్ని ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు గన్నవరం నుంచి ప్రారంభం అయ్యాయని ఎంపీ బాలశౌరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు.