TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
- తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
- ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICET Results 2024: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. ఐసెట్ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి. ఐసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. కాగా తెలంగాణ ఐసెట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Also Read
ఫలితాల కోసం.. క్లిక్ చేయండి.
రిజల్ట్ చూడండి ఇలా..
icet.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో TS ICET 2024 ఫలితాలను తనిఖీ చేయడానికి లింక్ కోసం చూడండి. దాన్ని క్లిక్ చేయండి
కొత్త పేజీ పాపప్ అవుతుంది. అభ్యర్థులు లాగిన్ వివరాలను సమర్పించాలి
లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తమ ఫలితాలను చూడవచ్చు
స్కోర్ కార్డ్‌లోని వివరాలను ధృవీకరించండి. పేజీని సేవ్ చేయండి
భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేసి, స్కోర్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
తాజావార్తలు
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. మరి బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!