ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.
విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. కానీ ఈ సారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని.. ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతంపైగా విజయం దేశ చరిత్రలో ఎవరికి రాలేదన్నారు. వెంకటేశ్వర స్వామి ముందు సంకల్పం చేసుకొని ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో తండ్రిని కన్నకూతురే కడతేర్చింది.