Maoists Surrender: సీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
- లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
- వరంగల్ ఇంచార్జ్ సీపీ సమక్షంలో లొంగుబాటు
- జనజీవన స్రవంతిలోకి తిక్క సుష్మిత..మడకం దూల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender: కరీంనగర్ సీపీ, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమక్షంలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తిక్క సుష్మిత అలియాస్ చైతే ఏరియా కమిటీ మెంబర్‌గా, మడకం దూల ఏరియా కమిటీ మెంబర్‌గా పనిచేశారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్‌గా పనిచేశారని ఎస్పీ తెలిపారు.
హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత(27) తన ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
Read Also: Vegetable Prices: వామ్మో ఇవేం ధరలు బాబోయ్!.. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేశారు. వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని, ఆ మొత్తాన్నిఈరోజు సీపీ చేతుల మీదుగా బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పి.తిరుమల్, హసనపర్తి ఇన్‌స్పెక్టర్ జె.సురేష్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..