ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖను పంపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆరేళ్ల చిన్నారిపై ఆగంతకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరలో చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.
గంజాయి వ్యాపారులు, వినియోగదారులకు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సేఫ్ గేమ్ మానేయాలని, ఓన్లీ స్ట్రయిట్ గేమ్స్ వుండాలని మంత్రి సూచించారు. మూడు నెలలు టైం ఇస్తున్నామని, పోలీసులు మారకపోతే మేం మార్పు చూపిస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే.
మీరు భార్యాభర్తల మధ్య విడాకుల కేసులను చూసి ఉంటారు, కానీ ఇంగ్లాండ్‌లో ఒక ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న ఒక వ్యక్తి తన విడాకులకు బాధ్యత వహిస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీదారు, ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్‌పై 6.3 మిలియన్ డాలర్ల దావా వేశారు
తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ రాజీనామా చేశారు. రిటైరైన తర్వాత సర్వీసులో కొనసాగనిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే కరికాల వలవన్ రాజీనామా చేశారు.