గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ప్యాకెట్లలో పాములు, ఎలుకలు, మానవుని వేళ్లు వస్తున్నాయి. ఇటీవల ముంబై నివాసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మానవ వేలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్శిల్ లో పాము కూడా వచ్చింది. ఇక మరో ఆన్ లైన్ ఆర్డర్ లో చనిపోయిన ఎలుక బయటపడింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈరోజు తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు వేశారు.
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్శిటీకి చేరుకున్న ప్రధాని మోదీ ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు చేసుకున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో మౌనం పాటించినట్లు సమాచారం.
లోక్‌సభ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయం కుదిర్చే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థికి సంబంధించి రక్షణ మంత్రి ఇంట్లో బీజేపీ, మిత్రపక్షాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. స్పీకర్ పదవిపై చర్చ జరిగింది.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో ఓ మహిళ సినిమా తరహాలో హత్యకు గురైంది. హత్య అనంతరం నిందితులు ఇంటికి నిప్పంటించి నగలు దోచుకెళ్లి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ చేయగా ఓ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ముంబైలో ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేసినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.