హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు, ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీ జరుగుతోంది. ప్రజలు సైతం విశాలమైన లేఔట్లలో అధునాత సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుంటుకున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్.
పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ తన చెల్లింపు యాప్‌ను విడుదల చేసింది. సూపర్.మనీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోన్‌పే నుంచి విడిపోయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
అమెరికాలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామా సిటీలో ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు.
దేశంలో జూన్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటిన వెంటనే ఐపీసీ కింద బ్రిటిష్ వారు చేసిన చట్టాలకు తెరపడనుంది. జులై 1వ తేదీ నుంచి వాటి స్థానంలో రూపొందించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తోంది. హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఆమె గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన ఇప్పుడు లోక్‌సభ సభ్యుడు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక కావడంతో ఎంపీలంతా లోక్ సభకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభకు చేరుకోగానే మీడియా కెమెరాలు ఆమె వైపు తిరిగాయి
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ బుధవారం తిరిగి నియమించింది. పిట్రోడా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.
18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలు కూడా స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టాయి.
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన టీనేజ్ కుమార్తెకు జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.