Sam Pitroda ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ బుధవారం తిరిగి నియమించింది. పిట్రోడా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శామ్ పిట్రోడా నియమితుయ్యారని వెల్లడించారు. ఈ ఏడాది మేలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు ప్రాంతంలోని భారతీయులు చైనీయులను పోలి ఉంటారని, దక్షిణాదిలో ఉన్నవారు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. పిట్రోడా వ్యాఖ్యలపై విస్తృతమైన దుమారం చెలరేగడంతో, కాంగ్రెస్ ఆయన ప్రకటనలకు దూరంగా ఉంది, వాటిని ‘ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది
Read Also: Jammu Kashmir: భద్రతా బలగాల కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. ఆ వ్యాఖ్యలను జాత్యహంకారం, విభజన అని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చర్మం రంగు ఆధారంగా అగౌరవపరచడం దేశం సహించదని.. దీనికి సమాధానం చెప్పాలని ప్రధాని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిట్రోడాను జాత్యహంకారిగా అభివర్ణించారు. వ్యాఖ్యలు అతని పక్షపాతాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.
శామ్ పిట్రోడా పూర్తి పేరు ఏమిటి?
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా హెడ్‌లైన్స్‌లో ఉండే శామ్ పిట్రోడా పూర్తి పేరు సత్యన్నారాయణ గంగారామ్ పిట్రోడా.