సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పీవీ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కూలిన టర్మినల్ పైకప్పు 2008-09 కాలంలో నిర్మించబడిందని మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం తెలిపారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ అంచనాల చిత్రం కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మార్నింగ్ షోల నుంచి ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ మెగా బడ్జెట్ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఈ చిత్రంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఈ చిత్రంలో చాలా క్యామియో అప్పియరన్సులు ఉన్నాయి.
పాన్ ఇండియా లెవెల్‌లో హీరో సూర్యకు ఉన్న స్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్య ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే కంగువ కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చాలా అప్‌డేట్స్ వచ్చాయి.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీపై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ రాజమౌళి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ఖాతాలో తన స్పందనను తెలియజేశారు.
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' కూడా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి కమల్ హాసన్ 'ఇండియన్ 2' వరకు చాలా పాన్-ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి
Coolie: లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం 'కూలీ' నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్‌గా మారింది. 'కూలీ' షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.
కేజీఎఫ్ చిత్రంతో కన్నడు హీరో యశ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రాఖీ భాయ్ పాత్రతో తన నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రంతో ఇండియన బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు ''టాక్సిక్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యశ్.
కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడం ద్వారా ఈ చిత్రం అపూర్వమైన మైలురాయిని సాధించింది. ప్రభాస్ హీరోగా నటించి 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి అమెరికాలో అడ్వాన్స్ సేల్స్ దిమ్మదిరిగిపోయేలా సాగుతున్నాయి. ఇప్పటికే ''ఆర్‌ఆర్‌ఆర్'' పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.