Bimbisara 2 : ఆగిపోయినట్లేనా? ‘బింబిసార 2’పై వీడని సందిగ్ధత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన ‘బింబిసార’ ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ విజయం చూసి, చిత్ర బృందం వెంటనే పార్ట్-2ను ప్రకటించింది. ఈ ఫ్రాంచైజీని మరింత భారీగా విస్తరించాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమా విడుదలై మూడున్నరేళ్లు దాటుతున్నా, ‘బింబిసార 2’ గురించి ఎలాంటి అధికారిక అప్‌డేట్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు గానీ, నటీనటుల ఎంపిక గానీ ఏదీ మొదలైన దాఖలాలు కనిపించడం లేదు.
Also Read : Band Melam: సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్న నాని టీమ్!
Also Read
- IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
- Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
‘బింబిసార’ తర్వాత కల్యాణ్ రామ్ చేసిన ‘డెవిల్’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం ‘పుష్ప’ చిత్రానికి రైటర్‌గా పనిచేసిన శ్రీకాంత్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ కొత్త సినిమా కనుక షూటింగ్ ప్రారంభమైతే, ‘బింబిసార 2’ మరింత కాలం వాయిదా పడటం ఖాయం. అసలు ఈ సీక్వెల్ కేవలం హైప్ కోసమే ప్రకటించారా? లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా? అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కల్యాణ్ రామ్‌కు ఒక సాలిడ్ హిట్ అవసరం ఉంది, అది వచ్చిన తర్వాతే ఇంతటి భారీ బడ్జెట్ సీక్వెల్‌ను టేకాఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!