Rahul Gandhi: రైతులతో రాహుల్‌గాంధీ భేటీ.. ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం
- రైతులతో రాహుల్‌గాంధీ భేటీ
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చ
- ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ బీజేపీ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాలు త్వరలో సంతకాలు కూడా చేయనున్నాయి. అయితే అమెరికా వాణిజ్య ఒప్పందంతో అన్నదాతలు రోడ్డెక్కారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఇబ్బందులేనని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రైతులతో సమావేశం అయ్యారు. ఇప్పటికే ఒకసారి భేటీ కాగా.. తాజాగా మరోసారి పార్లమెంట్ హాల్‌లో కలిశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 17 ప్రధాన రైతు సంఘాల ప్రతినిధులను కలిశారు. ఈ ఒప్పందం కారణంగా భారతీయ రైతులకు.. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, గింజలు పండించే రైతులకు హాని కలిగిస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
రైతులతో రాహుల్ గాంధీ భేటీ కావడంపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ ధ్వజమెత్తారు. దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారని… ఇదంతా ‘‘స్టేజ్ మేనేజ్డ్’’ అంటూ ధ్వజమెత్తారు. అత్యంత కృత్రిమమైన, నకిలీ సమావేశంగా అభివర్ణించారు. రైతులను తప్పుదారి పట్టించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి పనిచేసే అన్నదాతలను గందరగోళానికి గురిచేయడం, ప్రభుత్వ ఆర్థిక విధానానికి వ్యతిరేకంగా మనోభావాలను రెచ్చగొట్టడం ఈ సమావేశం లక్ష్యం అని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
భారత వస్తువులపై పరస్పర సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడానికి అమెరికా అంగీకరించిందని… ఇది వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఔషధాలలో భారత ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ 90-95 శాతం భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇటీవలే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగింది. గతంలో ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి.
नरेंद्र “surrender” मोदी ने भारत के किसानों के साथ विश्वासघात किया है – और किसान यह बात समझ चुके हैं।
यह सिर्फ़ एक व्यापार समझौता नहीं है, बल्कि हमारे अन्नदाताओं की आजीविका पर सीधा हमला है।
संसद में आज किसान यूनियनों के प्रतिनिधिमंडल से मुलाक़ात में उनकी चिंता साफ़ दिखी।… pic.twitter.com/YwfnJBMVcD
— Rahul Gandhi (@RahulGandhi) February 13, 2026
Farzi Rahul Gandhi… pic.twitter.com/lMMWhj7kKm
— Piyush Goyal (@PiyushGoyal) February 13, 2026
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?