Vishwaksen: విశ్వక్ లేడీ గెటప్‌లో లైలా.. మొదలెట్టేశాడు..
- అమ్మాయి గెటప్‌లో కనిపించనున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్
- లైలా ఐ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwaksen: వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటి సారి ఓ అమ్మాయి గెటప్‌లో కనిపించనున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్.. త్వరలో ‘లైలా’ అనే చిత్రంలో అమ్మాయి గెటప్‌లో అదరగొట్టనున్నట్టు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్స్ చేస్తున్న విశ్వక్ సేన్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించబడిన రామ్ నారాయణ్ విశ్వక్సేన్ను లైలాగా మునుపెన్నడూ లేని పాత్రలో ప్రదర్శించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. అటువంటి ధైర్యమైన, కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా, మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది.
Read Also: Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!
Also Read
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. ఈ ఫస్ట్ లుక్‌లో క్లోజ్‌గా కళ్లు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేశారు. సినీ మేకర్స్ లైలా ఐ లుక్‌ని ఆవిష్కరించారు. లైలాగా విశ్వక్ సేన్ తన అందచందాలతో వచ్చారు. విశ్వక్సేన్కు ఇది అందమైన మేక్ఓవర్. విశ్వక్ సరిగ్గా అమ్మాయిలా కనిపించడం వల్ల లుక్ అద్భుతంగా ఉంది. ఫిమేల్ గెటప్‌లో విశ్వక్‌లా మరే నటుడు కనిపించి ఉండరనడంలో సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంతవరకు సూట్ అయ్యాడో ఆ కళ్లను చూస్తేనే అర్థమవుతుంది. లైలా మనోహరమైన కాంతి అది స్త్రీ పాత్ర అని నమ్మేలా చేస్తుంది. లైలా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?