Student Delivery: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని ప్రసవించడం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. హాస్టల్ బాత్‌రూంలో విద్యార్థిని డెలివరీ కావడంతో తోటి విద్యార్థులు గుర్తించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. పుట్టిన బిడ్డ మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. రెండు నెలల క్రితమే కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థిని చేరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో ఆ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వైద్య చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Also: Delhi metro: ఢిల్లీ మెట్రోలో ఫైటింగ్.. కొట్టుకున్న యువకులు