ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి.. ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు.