ఏపీ యువతకు గ్లోబల్ స్థాయి ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చించారు. ఆ శాఖ కార్యదర్శులు కోన శశిధర్, సౌరభ్ గౌర్ ఈ సదస్సులో వివరించారు.
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని చంద్రబాబు అన్నారు.పోర్టులను నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.
విశాఖలోని బీచ్ రోడ్డులో హ్యాండ్లూం శారీ వాక్ కలర్‌ఫుల్‌గా జరిగింది. సూర్యోదయం కాగానే వేలాది మహిళలతో చేపట్టిన శారీ వాక్ సంప్రదాయాలను చాటి చెప్పింది. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఈ శారీ వాక్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. మంత్రి కూడా వైజాగ్ మహిళలతో కలిసి శారీ వాక్ చేశారు.
ఏపీలో దేవదాయ శాఖలో వరుస కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తర్వాత మరో అసిస్టెంట్ కమిషనర్ భూబాగోతాలు వెలుగులోకి వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నర్సుగా పని చేస్తున్న కావ్య(23) అనే యువతిపై బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కావ్యకు గాయాలు అయ్యాయి.