వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్ పలు శాఖలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో కలెక్టర్ కాన్పరెన్సులో సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. సత్యసాయిబాబా దగ్గర డబ్బుల్లేవు.. అయితే అనంతపురంకు తాగునీరు అందించాలనే తపన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే తాను ఓ కాల్ ఇస్తానన్నారు.. ఇచ్చారు దీంతో రూ. 200 కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆ వాటర్ ప్రాజెక్టులను తన భక్తులైన ఎల్ అండ్ టీని పెట్టి మెయింటెయిన్ చేయమని ఆయన కోరారని చెప్పుకొచ్చారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్‌డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక బృందాలు పరిశీలించాయి. ఆర్.డీ.ఎస్.ఓ, ఐ.సీ.ఎఫ్ బృందాలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూ్స్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది.
వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే సంస్కృతి ఏపీకి తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. రోజు రోజుకీ రాష్ట్రంలో ప్రేరేపిత హింస రెట్టింపు అవుతుందని ఆరోపించారు.
వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.