Botsa Satyanaryana: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలలో వైసీపీకి 530కి పైగా ఓట్లు బలం ఉందని.. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని వైసీపీ కోరుకుంటోందన్నారు. స్పష్టమైన మెజారిటీ వైసీపీకి ఉన్నప్పుడు టీడీపీ పోటీ ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు.
Read Also: Pawan Kalyan: భారత అంతరిక్ష రంగ పితామహుడి జీవితం స్ఫూర్తిదాయకం
ఎవరో బిజినెస్ మ్యాన్‌ను తీసుకుని వచ్చి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోందని.. రాజకీయాలు అంటే వ్యాపారమా అంటూ ప్రశ్నలు గుప్పించారు. స్వల్ప తేడా వుందంటే పోటీ పెట్టడం సరైనదే కానీ 300 ఓట్లు తేడా వున్నప్పుడు పోటీకి దిగడం ఎలా చూడాలన్నారు. క్యాంపు రాజకీయాలు పెట్టడానికి అసలు ఉద్దేశం దుష్టులకు దూరంగా ఉంచడం కోసమేనని ఆయన అన్నారు. మాకు బలం వుంది కాబట్టే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీకి వెళ్లామన్నారు. ఇప్పటికే రాజకీయాలు పలుచన అయ్యాయని.. ప్రజల ముందు మరింత పలుచని కావొద్దని సూచిస్తున్నానన్నారు. మిగతా వాళ్లతో పోలిస్తే విశాఖకు ఎవరు దగ్గరైన వ్యక్తో చెప్పాలన్నారు.