Pawan Kalyan: భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక శాస్త్రవేత్త దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో విక్రమ్ సారాబాయ్ జీవితమే ఉదాహరణ అంటూ ఆయన మాట్లాడారు. అంతరిక్ష పరిశోధన, తత్సంబంధిత రంగాల్లో గణనీయ విజయాలు సాధించడానికి కారణం ఆయన కృషేనన్నారు. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు అంజలి ఘటించారు. ఆయన అందించిన స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలన్నారు.
Read Also: AP Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పోలీస్ శాఖలో కొలువుల భర్తీ!
ఒక శాస్త్రవేత్త దేశం గురించి… తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంతటి గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ గారి జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. తిక శాస్త్ర పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, మన దేశానికి శాటిలైట్ ఆవశ్యకత గురించి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని ఒప్పించడం, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం ద్వారా దేశంలో అంతరిక్ష రంగం అభివృద్ధి చెందిందన్నారు. . మన దేశం అంతర్జాతీయంగా అర్ధవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని చెప్పిన విక్రమ్ సారాబాయ్ మాటలు నవతరం శాస్త్రవేత్తలు ఆచరణలో చూపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.