Andhra Pradesh: ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాంపై సీఐడీ విచారణ?
- సీఎం చంద్రబాబు దృష్టికి టీడీఆర్ బాండ్ల స్కాం
- టీడీఆర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కాం సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. తణుకులో టీడీఆర్ స్కాంపై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. తణుకు టీడీఆర్ బాండ్ల స్కాం జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. టీడీఆర్ స్కాంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించే అంశాన్ని కూటమి సర్కార్ పరిశీలిస్తోంది. సీఐడీ విచారణకు ఇస్తేనే టీడీఆర్ స్కాంపై అసలు సూత్రధారులు ఎవరనే అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం లీగల్ ఓపీనియన్ తీసుకుంటోంది. తణుకు మున్సిపాలిటీలో రూ.754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. మొత్తం రూ.691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరా రూ.55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా రూ.10 కోట్లు విలువ చూపడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేస్తోంది.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!