TFJA: నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని వేణుస్వామి.. వాళ్ళు ఎప్పుడు విడి పోతారో కూడా చెప్పేశారు. నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల కలిసి ఉండరని, వారు విడాకులు తీసుకుంటారని, నాగచైతన్యకు సంతానం కలిగే అవకాశం లేదని వారిద్దరి జ్యోతిష్యాలను అనాలసిస్ చేసి చెప్పారు.
Read Also: Anchor Soumya Rao: జబర్దస్త్ షో నుంచి అందుకే వెళ్ళిపోయ యాంకర్ సౌమ్యరావ్
గతంలో సినిమా రిలీజ్‌లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలు అయినా కూడ బుద్ది రాని వేణుస్వామి.. నాగ చైతన్య – శోభితలపై అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నీరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఛైర్‌పర్సన్ నీరెళ్ల శారద.. వేణుస్వామి పైన, టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ పైనా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.