YSRCP: 27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు
- 27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు
- రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం దారుణం
- ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం
- అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ
- ప్రజాభాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- తాజా వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి
- పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్ధేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైయస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
Read Also: CM Chandrababu: ఏపీ పర్యటనకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని విధించడం దారుణమన్నారు. దీనిని వ్యతిరేకిస్తూనైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఆయన మాట్లాడుతూ..” ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైయస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైయస్ఆర్ సిపి చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైయస్ఆర్ సిపి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలి.
Read Also: CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైయస్ఆర్ సిపి కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి.” అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!