బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. నవంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త ఇది. అయితే ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. ఎందుకంటే ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు.
రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆ విధంగా బ్యాంకులకు నవంబర్‌లో 17 సెలవులు ఉన్నాయ్. కానీ సోషల్ మీడియాలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవన్న ప్రచారం జరుగుతోంది. దీంట్లో ఎలాంటి నిజం లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దీపావళి, గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు శని, ఆదివారాలుతో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని ఖాతాదారులకు సూచించారు బ్యాంకు అధికారులు.