సూపర్ సండేకు టీమిండియా రెడీ అయ్యింది. సాయంత్రం న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీసేన… ఈసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్..ఇవాళ తలపడనున్నాయి. ఈ గ్రూప్ నుంచి సెమీస్‌కు చేరాలంటే.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే..ఇది డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. దాదాపు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.
తొలి మ్యాచ్‌లోని తప్పులను సరిదిద్దుకొని, కివీస్‌పై గట్టిగా పోరాడాలనే పట్టుదలతో ఉంది. తొలిమ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి మినహా మిగిలిన టాపార్డర్ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్, రాహుల్, సూర్య కుమార్ యాదవ్ సత్తాచాటాలి. అలాగే పంత్, పాండ్యా, జడేజా నుంచి భారీ హిట్టింగ్‌లు అవసరం. అటు కివీస్ ఎక్కువగా విలియమ్‌సన్, గుప్తిల్‌పై ఆధారపడింది.
అయితే ఆల్‌రౌండర్లతో ఉన్న కివీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.ఇక బౌలర్ల విషయానికొస్తే.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, నీషమ్ వంటి అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్లు కివీస్‌వైపు ఉన్నారు. సోధీ, మిచెల్ సాట్నర్ రూపంలో అద్భుతమైన స్పిన్నర్లు ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీతో.. టీమిండియా బౌలింగ్ స్ట్రాంగ్‌గా కనిపించింది. అయితే వీరు ముగ్గురు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫెయిలయ్యారు. దీంతో భువనేశ్వర్ లేదా షమీ ప్లేసులో శార్దూల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.