ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 461 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 15,054 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య […]
విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టుని క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ. గీతేష్ శర్మను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీఏడీ పరిధిలోకి ప్రత్యేక పోస్ట్ వస్తుందని చెప్పింది. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేపట్టింది. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్ […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ విజయ వంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం.. వ్యాక్సినేషన్ కాబట్టి… అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ విజయ వంతంగా అమలు చేస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ.. కరోనా వ్యాక్సినేషన్ విజయం వంతంగా ముందుకు సాగుతోంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 65 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు కరోనా వ్యాక్సినేషన్ బంద్ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా టీకాల పంపిణీకి […]
ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది కూడా సైనికులతో కలిసే దీపావళి పండగ జరుపుకోనున్నారు. గత ఏడాది రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని లోంగేవాలా సరిహద్దు వద్ద సైనికులతో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సారి ఆయన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఇవాళ నౌషేరా, రాజౌరీ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో కూడా రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జవాన్లతో పండగ జరుపుకొన్నారు.
ఇండియాలో పసిడికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే… మాత్రం… బంగారం ధరలు అమాంతం పెరిగిపోతాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 44,550 కి చేరింది. 10 గ్రాముల […]
దీపావళి పండుగ నేపథ్యంలో దేశ ప్రజల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఇచ్చారు. ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుందని… మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటామని తెలిపారు. భారతీయ సంస్కృతిలోని […]
ఈ దీపావళి పండగ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు డబుల్ థమాకాను ఇచ్చింది. దీపావళి సందర్భంగా మహేశ్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం జనవరి 13 నుండి ఏప్రిల్ 1కి వాయిదా పడినట్టు ప్రకటించారు. ఓ మంచి సినిమాను భారీ పోటీ మధ్యలో రిలీజ్ చేయకుండా, దర్శక నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ వాయిదా వార్తతో ప్రిన్స్ అభిమానులు కాస్తంత డీలా […]
వచ్చే సంక్రాంతి బరిలో పోటీపడబోతున్న పందెం కోళ్ళ విషయంలో నిదానంగా క్లారిటీ వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ యేడాది విడుదల కావాల్సిన ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే యేడాది జనవరి 13న విడుదల కావాల్సింది. కానీ ఎప్పుడైతే రాజమౌళి తన మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను ఈ యేడాది చివరిలో కాకుండా, వచ్చే జనవరి 26న కాకుండా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ […]
మాస్ మహరాజా రవితేజ కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఈ యేడాది సంక్రాంతి బరిలో ‘క్రాక్’తో ఘన విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. తాజాగా దీపావళి కానుకగా ఆయన కొత్త సినిమా… అదీ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తమిళ సంగీత దర్శకుడు […]