రైతుల తలరాత మార్చే.. తరతరాలు ఉండే గొప్ప ప్రాజెక్టు మల్లన్నసాగర్ అని… అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్ల ముందు జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ను శుక్రవారం ఉదయం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీఏం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం అయ్యిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ మేరకు ఎన్ని టీఏంసీల […]
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి […]
ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది రాజకీయం కాదు తపస్సు.. అందుకే ప్రపంచ దేశాలని మోడీ వైపు చూస్తున్నాయని ప్రశంసలు కురిపించారు గరికపాటి నరసింహారావు. హైదరాబాద్ లోని విద్యానగర్ శంకర్ మఠం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. రాజకీయాన్ని ఒక తపస్సుగా భావించింది భారత జాతి అని.. రాజకీయ తపస్సు ఎట్లా ఉంటుందో ఈనాడు ప్రధాని మోడీ లో చూశామని తెలిపారు. పరిపాలన మరీ సున్నితంగా..మరీ కఠినంగా ఉండకూడదని వెల్లడించారు. రాజకీయం బాగుండాలంటే మంత్రివర్గంలో తీసుకున్న […]
ఉన్నవి ఆరు పదవులు…ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ…ఆ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుంది ? ఎవరికి ఏ అంశం కలసి వస్తుంది ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయ్యింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలు…అధికార పార్టీకే దక్కుతాయి. దీనితో టిఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు, […]
విశాఖపట్నం…. చీకటి వ్యాపారాలకు రాచమార్గంగా మారింది. ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా.. నిషేధిత సరుకుల సరఫరా జరిగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ ఫేక్ సిగరెట్ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో […]
విశాఖజిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నేతల దాడి కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన మండల స్థాయి నాయకులు.. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో డ్యూటీలో ఉన్న ఉద్యోగి సత్యన్నారాయణ కారును అడ్డుకున్నారు. ఫీజ్ కట్టి వెళ్లాల్సినదేనని పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇతర సిబ్బంది కూడా అక్కడకు చేరుకోవడంతో మాటమాట పెరిగి చివరకు గొడవకు దారి తీసింది.తమనే అడ్డుకుంటావా అంటూ అధికార పార్టీ […]
బంగారం… ఎప్పుడూ డిమాండ్ ఉండే వస్తువు. ముఖ్యంగా మన దేశం లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏ సీజన్ అయినా.. బంగారం వ్యాల్యూ మాత్రం అస్సలు పడిపోదు. అయితే… గత కొన్ని రోజులుగా మన దేశం లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 48 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,550 […]
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బ్రావో. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా… లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అటు వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన కెరీర్‌కు […]
హైదరాబాద్ అంబర్ పేట్ లోని పాత పుస్తకాల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది… సుమారు ఒంటి గంట ప్రాంతంలో షాపులో మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసారు… పుస్తకాలు షాపు కావడంతో మంటలను అదుపుచేయటం ఫైర్ సిబ్బందికి కష్టతరం అయింది.. దీపావళి టపాసుల వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. అటు హైదరాబాద్‌లో దీపావళి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ఛత్రినాక పోలీస్ […]
టీ-20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం సాధించాయి. బంగ్లాపై భారీ విజయంతో మరోసారి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది ఆసీస్. వరుసగా ఐదు ఓటమితో బంగ్లా పులులు టోర్నీ నుంచి నిష్ర్కమించారు.బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ ఆడమ్ జంపా ధాటికి బంగ్లా హడలెత్తిపోయింది. 19 పరుగులు ఇచ్చిన జంపా 5 వికెట్లు తీసి బంగ్లా ఓటమిని […]