ఒకే రోజు మహేశ్ బాబు రెండు సినిమాల ప్రకటనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ దీపావళి పండగ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు డబుల్ థమాకాను ఇచ్చింది. దీపావళి సందర్భంగా మహేశ్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం జనవరి 13 నుండి ఏప్రిల్ 1కి వాయిదా పడినట్టు ప్రకటించారు. ఓ మంచి సినిమాను భారీ పోటీ మధ్యలో రిలీజ్ చేయకుండా, దర్శక నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ వాయిదా వార్తతో ప్రిన్స్ అభిమానులు కాస్తంత డీలా పడినా, కేవలం పోస్ట్ పోన్ వార్త చెప్పి వదిలి వేయకుండా, కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడం వాళ్ళకు ఊరటను కలిగించింది. దాంతో ఏప్రిల్ 1 కోసం వీళ్ళంత ఇప్పటి నుండే ఎదురుచూడటం మొదలెట్టేశారు. ఇదే సమయంలో మహేశ్ బాబు నిర్మిస్తున్న మరో మేజర్ మూవీ ‘మేజర్’ రిలీజ్ డేట్ నూ బుధవారం ఉదయం మహేశ్ బాబు ప్రకటించడం విశేషం. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతునట్టు మహేశ్ ట్వీట్ చేశారు. సో… మహేశ్ బాబుకు సంబంధించిన రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ను కొద్ది గంటల తేడాలోనే ఆయన ప్రకటించినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… ఈ రెండు సినిమాలపైనా ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read
- Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. 'RX100' టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
- Ram Charan: సర్జరీ తర్వాత తొలి దర్శనం.. కోయంబత్తూరు అయ్యప్ప ఆలయంలో రామ్ చరణ్ పూజలు!
- Venky Atluri: 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత ఆ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా!
- Item Songs: బాలీవుడ్‌లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
-
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!